శ్రీలంకతో నామమాత్రమైన మూడో వన్డేలో జట్టులోకి ఇషాన్ కిషన్‌ని తీసుకోకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. చివరి మ్యాచులో అవకాశం కల్పించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బంగ్లాదేశ్‌తో వన్డేలో ఇషాన్ డబుల్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత లంక సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ, ఒక్క మ్యాచులోనే ఆడే అవకాశం రాలేదు. వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్‌గా కేఎల్ రాహుల్‌ని జట్టులోకి తీసుకుంటున్నారు. అయితే, రాహుల్ బదులు ఇషాన్‌ని తీసుకోవాలని నెటిజన్లు సూచించారు. డబుల్ సెంచరీ చేశాక కూడా ఇషాన్ పక్కన పెట్టడం కరెక్టు కాదని కోచ్ రాహుల్ ద్రవిడ్‌ని నిందిస్తున్నారు.