AP: జీవో నెం.1పై వెకేషన్ బెంచ్ అత్యవసర విచారణకు స్వీకరించడంపై హైకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. రోస్టర్ నోటిఫికేషన్లో ఇలాంటి అంశం లేకున్నా సంక్రాంతి సెలవుల్లో విచారణ చేపట్టడానికి అంత తొందరేంటని మండిపడింది. వెకెషన్ బెంచ్ వ్యవహరించిన తీరు సరికాదని పేర్కొంది. రోడ్లపై సభలు, సమావేశాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.1పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, అత్యవసరంగా విచారణ జరిపాల్సిందిగా వెకేషన్ బెంచ్‌ని కోరాల్సిన అవసరం ఏమొచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది అశ్వినీ కుమార్‌ని ప్రశ్నించింది.