టీ20ల్లో ఎందుకు తీసుకోవట్లేదో మరి: ధావన్

© ANI Photo

టీమిండియా టీ20 జట్టులో తనను తీసుకోకపోవడంపై టీమిండియా స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ స్పందించాడు. తనను ఎందుకు తీసుకోవట్లేదో తెలియదు గానీ తప్పకుండా ఏదో ఒక కారణం ఉండి ఉండొచ్చని అన్నాడు. అయితే తాను అత్యుత్తమ ప్రదర్శన పైనే దృష్టి పెడతానని, తన చేతిలో లేని వాటి గురించి ఆలోచించనని చెప్పాడు. అలాగే విరాట్ కోహ్లీ ఫామ్ పై స్పందిస్తూ విరాట్ కోహ్లీకి ఒక్క ఇన్నింగ్స్‌ చాలని, అతడొక ఛాంపియన్‌ అని చెప్పాడు. ఇటీవల శ్రీలంక, వెస్టిండీస్‌లతో జరిగిన వన్డే సిరీస్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధావన్, ఆగస్టు 18 నుంచి జింబాబ్వేతో జరిగే వన్డే సిరీస్‌లోనూ టీమిండియాను నడిపించనున్నాడు.

Exit mobile version