శ్రీలంకతో తొలి వన్డేలో సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో చోటు కల్పించకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అద్భుత ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ను పక్కకు పెట్టడంలో ఆంతర్యం ఏంటని కోచ్ రాహుల్ ద్రవిడ్‌ని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేఎల్ రాహుల్‌కి బదులు సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో చోటు కల్పించాల్సిందని చెబుతున్నారు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌లను పోల్చుతున్నారు. మైదానంలో 360 డిగ్రీల్లో సిక్సర్ బాదగల నైపుణ్యం సూర్యకుమార్ సొంతమైతే.. 360 డిగ్రీల్లో క్యాచ్ ఇచ్చి ఔట్ కాగల బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ అంటూ విరుచుకుపడుతున్నారు.