సంజు శ్యాంసన్ని కాదని పంత్కి పదే పదే అవకాశాలు ఇవ్వడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఇచ్చిన వివరణను శశిథరూర్ తప్పుపట్టారు. ‘పంత్ గత 11ఇన్నింగ్సుల్లో పదింటిలో విఫలమయ్యాడు. మూడో వన్డేలోనూ నిరాశపరిచాడు. మరోవైపు, సంజుని బెంచ్‌కే పరిమితం చేశారు. వన్డేల్లో సంజు సగటు 66గా ఉంది. బ్యాటర్‌గా నిరూపించుకోవడానికి సంజు ఐపీఎల్ వరకు వేచి చూడాల్సి వస్తుంది’ అని శశిథరూర్ ట్వీట్ చేశారు. మూడో వన్డేలో పంత్ ఫెయిల్ అయ్యాడు. సంజు 11 వన్డేలు ఆడి 330 పరుగులు చేశాడు.
సంజుని ఎందుకు తీసుకోవట్లేదు: శశిథరూర్

© ANI Photo