అంత కర్మ జూ.ఎన్టీఆర్‌కు ఎందుకు?: నారాయణ

Courtesy Twitter:

కేంద్రమంత్రి అమిత్‌ షాను జూ. ఎన్టీఆర్ కలవడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుబట్టారు. ప్రధాని మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు అమిత్ షా స్మగ్లర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూ.ఎన్టీఆర్ తండ్రి, తాతా గొప్పవాళ్లని వారి వారసత్వాన్ని కొనసాగించాలని సూచించారు. అతన్ని కలవాల్సిన కర్మ జూ.ఎన్టీఆర్‌కు ఏమిటన్నారు. అటు కేసీఆర్ బిహార్ పర్యటనను నారాయణ ప్రశంసించారు. బీజేపీ వ్యతిరేక కూటమి కోసం కేసీఆర్ చేస్తున్న కృషిని అభినందిస్తున్నట్లు వెల్లడించారు.

Exit mobile version