• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • న్యూజిలాండ్‌కు ఎందుకు థాంక్స్?: గవాస్కర్

    భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరడంలో న్యూజిలాండ్ సహాయం చేసిందన్న చర్చపై సునీల్ గవాస్కర్ స్పందించాడు. కివీస్‌కు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గత రెండేళ్లుగా టీమిండియా అద్భుత ప్రదర్శనతో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిందని తెలిపాడు. ‘శ్రీలంకపై న్యూజిలాండ్ గెలిస్తే మంచిదే. అది కివీస్‌కు లాభం. అయితే, ఆసీస్‌తో చివరి టెస్టును భారత్ డ్రాగా ముగించింది. ఇలా అధికారికంగా ఫైనల్‌కు చేరుకుంది. ఇందులో న్యూజిలాండ్‌కు రుణపడి ఉండాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం’ అని గవాస్కర్ వెల్లడించాడు.