భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని తట్టుకోలేక పోయిన భర్త, కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుచూసింది. ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల సమీపంలో ఈ విషాదకర ఘటన జరిగింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన రామారావు భార్య అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఇది చూసిన రామారావు తట్టుకోలేకపోయాడు. ఏడేళ్ల తన కుమారుడితో కలిసి రైలు కింద పడి చనిపోయాడు.