2020లో తూర్పు లడఖ్‌లో జరిగిన PLA దురాక్రమణ తర్వాత చైనా, ఇండియాతో ద్వైపాక్షిక సంబంధాల కోసం భేటీ కానుంది. ఈ క్రమంలో మార్చి 24, 25న రెండు రోజుల పర్యటన నిమిత్తం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత్ రానున్నారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో చర్చలు జరపనున్నారు. అయితే ఈ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారో లేదా తెలియదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఉక్రెయిన్ పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం తన పాశ్చాత్య భాగస్వాములతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉన్న తరుణంలో ఈ భేటీ కీలకం కానుంది.