తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన మాస్టర్ ప్లాన్ దుర్మార్గమని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. కామారెడ్డి నగరంలో ఇండస్ట్రియల్ జోన్ల కోసం రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. త్వరలోనే కేసీఆర్ను రైతులు గద్దె దింపుతారు అని పేర్కొన్నారు. తాను ఈరోజు హైకోర్టులో వాదనలు వినిపించాను. అవసరం అయితే దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తానని చెప్పారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని స్పష్టం చేశారు.