ఆసక్తికరంగా సాగుతున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో నేడు ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడనుంది. ఓటమే ఎరుగకుండా హర్మన్ సేన టోర్నీలో టాప్‌లో దూసుకెళ్తోంది. మరోవైపు గెలుపు కోసం గుజరాత్ జెయింట్స్ తపన పడుతోంది. జట్ల బలాబలాల పరంగా చూస్తే మ్యాచ్‌లో ముంబై ఫేవరేట్. కానీ, ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ముంబైకి ఓటమి రుచి చూపించాలని గుజరాత్ జెయింట్స్ ఆరాటపడుతోంది. బ్రబౌర్న్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. పాయింట్స్ టేబుల్‌లో గుజరాత్ జెయింట్స్ నాలుగో స్థానంలో ఉండగా, ముంబై టాప్ ప్లేసులో ఉంది.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్