కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో తానూ భాగస్వామినవుతానని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. మహారాష్ట్రలోకి ప్రవేశించాక ఈ యాత్రలో పాల్గొంటానని శరద్ పవార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. వచ్చేనెల 7న రాహుల్ పాదయాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలతో కలిసి శరద్ పవార్ పాల్గొననున్నారు.