ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి భయం అంటే ఏంటో చూపిస్తామని.. ఆ బాధ్యత తనపై ఉందని టీడీపీ నేత లోకేష్ కుమార్ వెల్లడించారు. 12వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా చిత్తూరులో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు జగన్ మోసం చేశారని, అందుకే జగన్ మోసపు రెడ్డి అని పేరు పెట్టామన్నారు. అమర్‌రాజా సంస్థను పక్క రాష్ట్రానికి పంపించి.. చిత్తూరు జిల్లాలో ఉద్యోగాలు రాకుండా చేశారని లోకేష్ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ విధానాలను ఆయన తప్పుపట్టారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్