ఆ పదవితో కొడాలి నాని సంతృత్తి చెందుతాడా ?

ఏపీలో మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. కొత్తగా ఏర్పాటు చేసిన 25మంది మంత్రి వర్గంలో 14మంది కొత్త వారికి అవకాశం కల్పించగా.. 11 మంది పాతవారిని కొనసాగించారు. అయితే వైసీపీలో కీలక నేతగా ఉన్న గుడివాడ ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి కొడాలి నానికి నూతన మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దీంతో ఆయన కార్యకర్తలతో పాటు వైసీపీ నేతలు షాక్ అయ్యారు. అయితే కొడాలి నాని మాత్రం తాను సంతృప్తికరంగానే ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. కాగా ఏపీ ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న స్టేట్ డెవలప్మెంట్ బోర్డుకు చైర్మన్‌గా నానిని నియమిస్తారని, ఆ పదవికి క్యాబినెట్ హోదా కల్పించనున్నట్లు తెలుస్తుంది.

Exit mobile version