కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత యడియూరప్ప వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. తన నియోజకవర్గం శికారిపురా నుంచి తన కుమారుడు విజయేంద్ర పోటీ చేస్తారని తెలిపారు. తనలాగే తన కుమారుడిని ఆదరించాలని యడియూరప్ప నియోజకవర్గ ప్రజలను కోరారు. అయితే పాార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు. 2023లో ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానివ్వమని..భాజపా అభ్యర్థే సీఎం అవుతారని యడియూరప్ప పేర్కొన్నారు.
ఇక ఎన్నికల్లో పోటీ చేయను: యడియూరప్ప

© ANI Photo