వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడబోనని హార్దిక్ పాండ్యా క్లారిటీ ఇచ్చాడు. పూర్తిగా సన్నద్ధం అయ్యాకే టెస్టుల్లోకి ఎంట్రీ ఇస్తానని స్పష్టం చేశాడు. ‘ఉన్నట్టుండి ఒకరి స్థానంలోకి రావడం నైతికం కాదు. కష్టపడి, పూర్తిగా సన్నద్ధం అయ్యాకే టెస్టుల్లోకి వస్తా. అప్పటివరకు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గాని, ఇతర టెస్టు సిరీసుల్లో గాని ఆడబోను’ అని హార్దిక్ తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం హార్దిక్ టెస్టుల్లో ఆడాలనే చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. జూన్ 7-11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.