పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మార్చి 27న ఇస్లామాబాద్‌లో జరిగే బహిరంగ ర్యాలీలో రాజీనామా చేసే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. ఈ ర్యాలీలో ఆయన ముందస్తు ఎన్నికలను ప్రకటించి, ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు విదేశీ నిధుల కేసులో సోమవారం ఇమ్రాన్ అరెస్టయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 342 మంది సభ్యులున్న అక్కడి అసెంబ్లీలో ఖాన్ PTI ప్రభుత్వంలో కొనసాగడానికి కనీసం 172 మంది సభ్యులు అవసరం. కాని పాలక PTIకి చెందిన దాదాపు 24 మంది శాసనసభ్యులు ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో విశ్వాసం కోల్పోయారని సమాచారం.