తెలంగాణకు కేంద్ర నిధుల అంశంపై BJP నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ‘‘రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ. 3.68 లక్షల కోట్లు వెళ్లాయి. కేంద్రం తెలంగాణకు రూ.2 లక్షల కోట్లు ఇచ్చింది. ఇది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా’ అని సవాల్ విసిరారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు గొడవ నడుస్తుంటే అది ఆపలేని ప్రధాని మోదీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపారా? ’’ అంటూ ఎద్దేవా చేశారు.