జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా RRR. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఈనెల 25వ తేదీన విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రపంచ వ్యాప్తంగా ప్రమోషన్లు మొదలుపెట్టేసింది. అయితే రూ.500 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు రూ.200 కోట్ల వసూళ్లు రాబట్టడం కచ్చితమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినివ్వడంతో పాటు, ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. అటు ఓవర్సీస్లోనూ RRR భారీ అంచనాలు ఉండడంతో, ప్రీబుకింగ్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. ఈ లెక్కలన్నీ పరిగణలోకి తీసుకుంటే RRR మొదటిరోజే రూ.200 కోట్లు కలెక్ట్ చేయడం కచ్చితమని చెబుతున్నారు ట్రేడ్ పండితులు.