చెంప దెబ్బ సంఘటన..విల్ స్మిత్ రాజీనామా

Screengrab Twitter:

94వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా స్టార్ యాక్టర్ విల్ స్మిత్ కమెడియన్ క్రిస్ రాక్ ను చెంపపై కొట్టాడు. ఆ పరిణామం నేపథ్యంలో తాజాగా ఆస్కార్ అకాడమీ సభ్యత్వానికి విల్ స్మిత్ రాజీనామా చేశారు. వేదికపై కొట్టడం పట్ల తాను బాధను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపాడు. తన ప్రవర్తన క్షమించరానిదని అన్నాడు. మరోవైపు ఈ అంశంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్మిత్ రాజీనామాకు అకాడమీ ఆమోదం తెలిపింది. అయితే ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో క్రిస్ రాక్.. స్మిత్ భార్య తల గుండు గురించి కామెంట్లు చేశాడు.

Exit mobile version