భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐఎంఎఫ్ అంచనాలు దాటుతోందని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ తెలిపారు. పెరుగుతున్న మూలధన పెట్టుబడులతో అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. జీడీపీ వృద్ధి రేటును ఐఎంఎఫ్ రెండుసార్లు సవరించింది. మెుదట్లో భారత్ 8.2 శాతం నమోదు చేస్తుందని ప్రకటించిన తర్వాత జులైలో 7.4 శాతానికి తగ్గించారు. అంతర్జాతీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు కారణంగా 6.8 శాతానికి కుదించారు.
జీడీపీలో ఐఎంఎఫ్ అంచనాలు దాటేస్తాం: సీఈఏ

© ANI Photo