శ్రీలంక సిరీస్ క్లీన్‌స్వీప్ చేసి దూకుడు మీదున్న టీమిండియా న్యూజిలాండ్‌తో పోరుకు రెఢీ అయ్యింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మెుదటి మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ సిరీస్‌కు వ్యక్తిగత కారణాలతో రాహుల్ దూరమయ్యాడు. దీంతో ఇషాన్ కిషన్‌కు బెర్త్ దాదాపు ఖరారయినట్లు భావిస్తున్నారు. ఊహించని విధంగా శ్రేయస్ అయ్యర్ కూడా దూరమవ్వటంతో సూర్య కుమార్‌కు అవకాశం దక్కవచ్చు.