ఖమ్మంలో లకారం చెరువు మధ్యలో కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాం ఏర్పాటు చేస్తుండటంపై వివాదం కొనసాగుతోంది. ఈ నెల 28న ఎన్టీఆర్ శతజయంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వేళ యాదవ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. దేవుడి రూపంలో నటుల విగ్రహాలు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. విగ్రహాన్ని కూల్చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరపాలని మంత్రి పువ్వాడ ఏర్పాట్లు చేశారు. తారక్ కూడా వచ్చేందుకు ఒప్పుకున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
-
Screengrab Twitter:Rakesh49431
-
Screengrab Twitter:itsmeeYasin