ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టులో చోటు సంపాదించాడు యంగ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్. సౌతాఫ్రికాతో 5 టీ20ల సిరీస్ కు ఎంపికయ్యాడు. గురువారం దిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగబోతున్న వేళ తుది జట్టులో ఉమ్రాన్ చోటుపై కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మనది చాలా పెద్ద జట్టు. భువనేశ్వర్, హర్షల్, ఆవేశ్ లాంటి సీనియర్ బౌలర్లు ఉన్నారు. ఇలాంటి సమయంలో జట్టు ఎంపిక తలనొప్పే. ఒకేసారి అందరికీ అవకాశాలు రావు. కానీ తప్పకుండా ఉమ్రాన్ ను పరీక్షిస్తాం.’అని రాహుల్ అన్నారు. దీంతో తొలిమ్యాచ్ లో ఉమ్రాన్ బుల్లెట్ బంతులను చూస్తామా లేదా అన్నది ఇంకా సస్పెన్స్ గానే మిగిలిపోయింది.