కృష్ణజింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తమ సమాజానికి క్షమాపణలు చెప్పాలని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ డిమాండ్ చేశాడు. లేదంటే తర్వాత ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. తాము ఎంతో పవిత్రంగా భావించే కృష్ణ జింకలను సల్మాన్ చంపడంతో తమ సమాజం అతడిపై తీవ్ర ఆగ్రహంతో ఉందని తెలిపాడు. సల్మాన్ అహాన్ని త్వరలోనే దెబ్బతీస్తామని హెచ్చరించాడు. సల్మాన్ తమ పవిత్ర ఆలయానికి వచ్చి క్షమాపణలు కోరితే వదిలేస్తామని తెలిపాడు.