నేటి నుంచి ఆస్కార్ నామినేషన్స్ ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 7 గంటలకు ఈ నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఓటింగ్ ముగిసింది. రిజ్ అహ్మద్, అల్లిసన్ విలియమ్స్ ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తారు. శామ్యూల్ గోల్డ్విన్ థియేటర్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. వివిధ ఛానెళ్లు, సోషల్ మీడియా ద్వారా ఈ నామినేషన్ల ప్రక్రియను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. టిక్‌టాక్, యూట్యూబ్, ట్విటర్, ఫేస్బుక్, హులు లైవ్ టీవీలో వీక్షించవచ్చు.