నితీష్‌తో కలిసి సోనియాను కలుస్తా: లాలూ

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఉమ్మడి ప్రతిపక్షంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామన్నారు. త్వరలోనే బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తానని తెలిపారు. భారత్ జోడో యాత్ర పూర్తయిన తరువాత రాహుల్‌ను కూడా కలుస్తానని తెలిపిన ఆయన.. బీజేపీ కారణంగానే దేశంలో మత కల్లోలాలు చెలరేగుతున్నాయన్నారు.

Exit mobile version