ఐపీఎల్ 2022లో అదరగొట్టి టీమిండియాలోకి తిరిగి చోటు సంపాదించుకున్నాడు దినేష్ కార్తీక్. అయితే ఐపీఎల్‌లో రాణించినా.. టీమిండియా స్థానం పొందలేక సతమతమవుతున్నాడు వృద్ధిమాన్ సాహా. దీనిపై అతను తాజాగా స్పందించాడు. టీమిండియా జట్టులో ఇకపై తనను తీసుకోకపోవచ్చని, తన ద్వారం ముగిసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. భవిషత్తులో తాను జాతీయ జట్టుకు ఆడతానన్న నమ్మకం తనకు లేదని పేర్కొన్నాడు ఈ 37 ఏళ్ల క్రికెటర్.