హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ATMలో రూ.500 డ్రా చేస్తే రూ.2500 రావడంతో జనం ఎగబడడ్డారు. మంగళవారం రాత్రి శాలిబండకు చెందిన వ్యక్తి హరిబౌలి చౌరస్తాలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎం నుంచి రూ.500 డ్రా చేయగా.. రూ.2500 వచ్చాయి. అతడు పోలీసులకు సమాచారం అందించగా….అప్పటికే విషయం తెలుసుకున్న స్థానికులు ఏటీఎం వద్ద గుమిగూడారు. పోలీసులు పరిశీలించి..బ్యాంకుకు సమాచారం అందించి ఏటీఎం మూసివేశారు.