కొత్త హార్దిక్ పాండ్యను చూస్తున్నాం: గవాస్కర్

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, GT కెప్టెన్ హార్దిక్ పాండ్యపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంశల వర్షం కురిపించాడు. గత కొన్ని సీజన్ల నుంచి ఫామ్‌లో లేని హార్దిక్ పాండ్య.. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడని ఓ కొత్త పాండ్యను చూస్తున్నామని పేర్కొన్నాడు. అతను ధోని నుంచి ఎంతో నేర్చుకున్నాడని, సీనియర్ల నుంచి నేర్చుకుంటే మంచి భవిషత్తు ఉంటుందని తెలిపాడు. అతనిలో ప్రస్తుతం క్రమశిక్షణ కనిపిస్తుందన్న సన్నీ.. పాండ్య ఆలోచించి ఆడితే ఆట తీరు మెరుగవుతుందని పేర్కొన్నాడు. కాగా నిన్న KKRతో జరిగిన మ్యాచ్‌లో GT 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Exit mobile version