బిహార్ భగల్‌పూర్ జిల్లాలోని పిర్‌పయింతి మార్కెట్‌లో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ మహిళను దారుణంగా నరికారు. తీవ్ర గాయాలపాలైన మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా దుండగులు తనను వెంబడించినట్లు ఆమె పోలీసులకు చెప్పింది. షకీల్ అనే వ్యక్తి తన తలపై కొట్టగా మిగతా వ్యక్తులు ఆమె చేతులు, వక్షోజాలు నరికేశారు. కేసులో ఒకరిని అరెస్ట్ చేశామని మిగిలినవారు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.