చెన్నైకి చెందిన భవానీ, భాగ్యరాజ్ ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిళ్లలు. భర్త ఉద్యోగానికి వెళ్లాక ఖాళీ సమయంలో భవానీ రమ్మీ ఆడటం అలవాటు చేసుకుంది. అది వ్యసనంగా మారింది. ఎంతలా అంటే ఉన్న నగలన్నీ అమ్మి, లక్షల్లో అప్పుల్లో కూరుకుపోయింది. భర్త మందలించినా వినకుండా అప్పులు చేస్తూనే పోయింది. స్నేహితులు, బంధువులు, బ్యాంకుల్లో కలిపి సుమారు రూ.20 లక్షల బాకీ చేసింది. చివరకు దిక్కుతోచని స్థితిలో భర్త ఇంట్లో సమయం చూసి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.