అమెరికాకు చెందిన ఓ రచయిత్రి భర్తను ఎలా చంపాలో వివరిస్తూ ఓ బుక్ రాసింది. కానీ ఆ రచయిత్రే తన భర్తను చంపేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రానికి చెందిన నాన్సీ అనే రచయిత్రి ఓ ఇన్ట్సిట్యూట్ లో చెఫ్ గా పని చేస్తున్న తన భర్తను తుపాకీతో కాల్చి చంపింది. తాను కాల్చినట్లు దొరకకుండా ఉండేందుకు తన భర్తతో కొన్న పిస్టల్ స్లైడ్, బ్యారెల్ కాకుండా వేరే వాటిని ఉపయోగించింది. అయినా కానీ చివరికి దొరికి కటకటాలపాలయింది. పోలీసులు ఆ కి‘లేడీ’ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.