జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5(2019-21)లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 51.2 శాతం మంది పురుషులకు ఇంటర్నెట్ వినియోగమే తెలియదట. 48.8 శాతం మందే ఇంటర్నెట్ వాడుతున్నారు. అలాగే టీవీలను పురుషులు, మహిళలు సమానంగా వీక్షిస్తున్నారు. కాని తెలంగాణలో పురుషుల కంటే ఎక్కువగా మహిళలే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారని నివేదికలో వెల్లడైంది. పురుషుల్లో 50 శాతం కంటే తక్కువగా అంతర్జాలాన్ని ఉపయోగిస్తే మహిళల్లో 73.5 శాతం వినియోగిస్తున్నారట. దేశవ్యాప్తంగా బిహార్ అంతర్జాల వినయోగంలో ముందు వరుసలో ఉంది.