ఈ ఏడాది ప్రారంభం కానున్న మహిళా ఐపీఎల్ మీడియా ప్రసార హక్కులను రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 చేజిక్కించుకుంది. 2023 నుంచి 2027 వరకు ఐపీఎల్ ప్రసార హక్కులను రూ.951 కోట్లకు బిడ్ వేసి దక్కించుకుంది. అంటే ఒక్కో మ్యాచ్ విలువ రూ.7.09 కోట్లు అన్నమాట. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జే షా ట్విటర్లో ధ్రువీకరించారు. బీసీసీఐ, మహిళల ఐపీఎల్‌పై విశ్వాసం ఉంచినందుకు వయాకామ్ 18కి జే షా ధన్యవాదాలు తెలిపారు. కాగా, పురుషుల ఐపీఎల్‌కు సంబంధించి వచ్చే ఐదేళ్లకు గాను డిజిటల్ హక్కులను వయాకామ్ 18 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.