నేటినుంచి ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కాబోతోంది. జట్లన్నీ సమరోత్సాహంతో బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల ఐపీఎల్ పై బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. 6 జట్లతో 2023 నుంచి మహిళల ఐపీఎల్ ను నిర్వహించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశంలో ఈ అంశంపై చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు పురుషుల ఐపీఎల్ ప్లే ఆఫ్స్ జరిగే సమయంలోనే మహిళలకు నాలుగు ఎగ్జిబిషన్ మ్యాచ్ లను నిర్వహిస్తామని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ పేర్కొన్నాడు. ఇదే నిజమైతే త్వరలోనే మనం మహిళల ఐపీఎల్ ను కూడా పూర్తి స్థాయిలో ఆస్వాదించవచ్చు.