చరిత్ర సృష్టించిన మహిళల లాన్ బౌల్స్ ప్లేయర్స్

Courtesy Twitter: ANI

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల లాన్ బౌల్స్ ప్లేయర్స్ చరిత్ర సృష్టించారు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లారు. లవ్లీ చౌబే, పింకీ, నయన్‌మోని, సైకియాల టీం ఈ విజయం సాధించడంతో.. లాన్ బౌల్స్‌లో భారత్ మొట్టమొదటి పథకం గెలవనుంది. అటు పురుషుల లాన్ బౌల్స్ జట్టు ఇంగ్లాండ్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. కాగా కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ఇప్పటి వరకు ఆరు పథకాలు వచ్చాయి.

Exit mobile version