దశాబ్దాలుగా పోరాడుతున్నా ఇండియన్ మహిళల జట్టు వరల్డ్ కప్ మాత్రం సాధించడం లేదు. 2017 వన్డే వరల్డ్‌కప్‌తో పాటు 2020 టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్ వరకు వచ్చినా, కప్పు కల మాత్రం నెరవేరలేదు. దీంతో ఈసారి న్యూజిలాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఎలాగైనా కప్పు కొట్టాలని భావిస్తోంది టీమిండియా మహిళల జట్టు. అయితే ఈ టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌తోనే బోణి కొట్టి కప్పు సాధించాలనే పట్టుదలతో టీమిండియా జట్టు ఉంది. మరి ఈసారైనా ఇండియన్స్ కప్పు కొడతారో లేదో చూడాలి.