రోహిత్ శర్మ టీ20 కెరీర్ ఇక ముగిసినట్లే అని పుకార్లు పుట్టుకొస్తున్న తరుణంలో హిట్‌మ్యాన్ స్పందించాడు. టీ20ల నుంచి తప్పుకోవాలని ఇంకా నిర్ణయించుకోలేదని రోహిత్ శర్మ బదులిచ్చాడు. ఇటీవల పూర్తయిన శ్రీలంక సిరీస్‌లో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ ఇక వన్డే, టెస్టులకు మాత్రమే సారథ్యం వహిస్తాడని అంతా చర్చించుకున్నారు. రేపటి నుంచి శ్రీలంకతో వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేయబోతున్నానని రోహిత్ శర్మ ఈ సందర్భంగా ప్రకటించాడు. నెట్స్‌లో బౌలింగ్ చేస్తుండగా బుమ్రా ఇబ్బందిపడటం వల్లే సిరీస్ నుంచి తప్పించినట్లు రోహిత్ క్లారిటీ ఇచ్చాడు.