ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణానికి చెందిన కడిపు శ్రీనివాస్ అనే వడ్రంగి కళాకారుడు చెక్కలతో ట్రెడ్మిల్ తయారు చేశాడు. టేకు చెక్కలతో 3 రోజుల్లో దీన్ని తయారు చేసినట్లు వెల్లడించాడు. తయారీకి మొత్తం రూ.12000 ఖర్చు అయిందని చెప్పాడు. దీంతో కరెంట్ అవసరం లేకుండానే ట్రెడ్మిల్ ఉపయోగించవచ్చు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా అది తెలంగాణ మంత్రి కేటీఆర్ వరకు చేరింది. శ్రీనివాస్‌ను ప్రశంసించిన KTR అతడికి సాయం చేయాలని ట్వీట్ చేశాడు. దీంతో తెలంగాణ మంత్రులు కొంత మంది అతడికి ఫోన్‌చేసి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పాడు.