భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేస్తూ 60 లక్షల మందిని చైతన్య పరిచేలా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ నేతలకు సూచించారు. భారాస జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో టెలీకకాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. “ ప్రజాప్రతినిధులు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలి. జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించుకోవాలి. పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగ నిర్వహించుకోవడంతో పాటు ఏప్రిల్ 25న పార్టీ ప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేసుకోవాలని శ్రేణులకు కేటీఆర్ సూచించారు.