గతంలో కమెడియన్ చిత్రం శ్రీను దగ్గర టచప్ బాయ్‌గా పని చేశానని కమెడియన్, దర్శకుడు వేణు యెల్దండ తెలిపాడు. ‘‘1999లో ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చా. ఆ తర్వాత ఓ చిన్న సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశా. తొలుత అవకాశాలు లేక అంట్లు తోమాను. బాత్రూమ్‌లు కడిగాను. ఆ తర్వాత 200 సినిమాల్లో నటించా. కానీ సరైన బ్రేక్ రాలేదు. ఇప్పటికి ‘బలగం’ సినిమాతో గుర్తింపు వచ్చింది. ఇన్నేల్ల కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కింది.’’ అంటూ ఎమోషనల్ అయ్యాడు.