ఉక్రెయిన్పై దాడిని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పలు క్రీడా సమాఖ్యలు రష్యాపై నిషేధం విధించాయి. తాజాగా ఆ జాబితాలో వరల్డ్ అథ్లెటిక్స్ కూడ చేరింది. ప్రపంచ అథ్లెటిక్స్ నిర్వహించే టోర్నీలో రష్యా, ఆ దేశానికి మద్దతుగా నిలిచిన బెలారస్ క్రీడాకారులను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. రష్యా అథ్లెటిక్స్ సమాఖ్యపై డోపింగ్ ఉల్లంఘన కారణంగా 2015 నుంచి ఆంక్షలు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఫిపా, వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ రష్యాను బహిష్కరించాయి.