రష్యా చేస్తున్న ముప్పేట దాడితో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్‌కు భారీ ఆర్థిక సాయం అందించేందుకు ప్రపంచబ్యాంకు, IMF ముందుకు వచ్చాయి. వరల్డ్ బ్యాంకు 3.5 బిలియన్ల అమెరికన్ డాలర్లు, IMF 2 బిలియన్ల అమెరికన్ డాలర్లను ఇవ్వనున్నట్లు ప్రకటించాయి. ఈ సాయాన్ని వెంటనే ఉక్రెయిన్‌కు పంపనున్నట్లు తెలిపాయి. ఈ వారంలోనే ఈ సాయం అందేలా చూస్తామని పేర్కొన్నాయి.