డిసెంబర్‌లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

© File Photo

విజయవాడలో డిసెంబర్‌ 23,24 తేదీల్లో 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి. ఈ మేరకు నిర్వాహకులు వెల్లడించారు. సమకాలీన పరిస్థితుల్లో రచయితల పాత్ర, కర్తవ్యం అంశాలపై ఈ సభలు జరగనున్నాయి. విజయవాడంలోని పీబీ సిద్దార్థ డిగ్రీ కాలేజీలో కార్యక్రమం జరగనుంది. ప్రపంచ దేశాల్లోని తెలుగు రచయితలు, సాహితీ అభిమానులు వేడుకకు తరలి రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. తెలుగు భాష, రచనలు, తదితర అంశాలపై చర్చించనున్నారు.

Exit mobile version