గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో పాల్గొన్న హీరో రామ్ చరణ్ అక్కడి మీడియాతో ఆసక్తికర అంశాలు పంచుకున్నారు.టాలీవుడ్, హాలీవుడ్ లాంటి అన్ని వుడ్‌లు పోయి గ్లోబల్ సినిమా వస్తుందని హీరో రామ్ చరణ్ ఆకాంక్షించారు. ఎన్టీఆర్‌తో పోటీ గురించి మాట్లాడారు. “ ఎన్టీఆర్ కుటుంబంతో తమకు 30 ఏళ్ల నుంచి స్నేహపూర్వక పోటీ ఉంది. రెండు కుటుంబాల మధ్య హెల్తీ కాంపిటేషన్ ఉండేది. తారక్‌తో కలిసి మరో సినిమాలో నటించాలి అనుకుంటున్నా. ప్రస్తుతం ఆరు ప్రాజెక్టులకు సంతకాలు చేశాను” అని చెప్పారు.