డబ్ల్యూపీఎల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో ఢిల్లీని చిత్తు చేసి వరుసగా మూడో విజయం నమోదు చేసింది. ముంబై ఓపెనర్లు యాస్తికా భాటియా (42), హీలీ మ్యాథ్యూస్ (32) రాణించారు వీరిద్దరూ ఔటైన తర్వాత బ్రంట్ (23), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (11)లు జట్టును విజయతీరాలకు చేర్చారు. ఢిల్లీ బౌలర్లలో అలీస్ కాప్సే, తారా నోరిస్‌లు చెరో వికెట్ తీశారు. సైకా ఇషాక్‌కు వుమెన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.