వరుసగా గుజరాత్ జెయింట్స్ రెండో విజయం నమోదు చేసింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 11 రన్స్ తేడాతో విక్టరీ సాధించింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ చివరి వరకూ పోరాడి ఆఖర్లో చేతులెత్తేసింది. 18.4 ఓవర్లలో 136 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. జట్టులో మారిజాన్నే కాప్(36), అలిస్సీ కాప్సే(22) రాణించారు. చివర్లో తెలుగమ్మాయి అరుంధతిరెడ్డి(25) గొప్పగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. గుజరాత్ బౌలర్లలో గార్డ్‌నర్, కిమ్ గార్త్, తనూజా కన్వర్‌లు తలో రెండు వికెట్లు తీశారు.