డబ్ల్యూపీఎల్‌లో భాగంగా ముంబై వేదికగా గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా గుజరాత్ ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి ఒక్కటి మాత్రమే గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. మరోవైపు ఢిల్లీ తానాడిన మూడు మ్యాచ్‌లలో రెండు నెగ్గి జోరు మీదుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య అమీతుమీ నెలకొననుంది.