వృద్ధిమాన్ సాహాకు జర్నలిస్టు నుంచి వచ్చిన బెదిరింపులపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీని నేడు కలిశాడు. తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా దర్యాప్తుకు అవసరమైన అన్ని వివరాలను అందించినట్లు చెప్పాడు. దీని గురించి ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను అన్నాడు. సాహకు వచ్చిన బెదిరింపుల విషయాన్ని రవిశాస్త్రి, పార్థివ్ పటేల్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి మాజీ క్రికెటర్లు తీవ్రంగా ఖండించడంతో ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు ప్రభతేజ్ భాటియాతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.